ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. . వరదలు, వర్షాలపై చంద్రబాబు..

జగన్ సర్కారు నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. రేణిగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. వర్షాలు ఈ ఏడాది ఎక్కువగా పడుతాయని సమాచారం ఉంది..రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ముందుగానే సమాచారం వచ్చింది…అయినా ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేదు. దీంతోనే ప్రాణనష్టం అధికంగా ఉందని చంద్రబాబు అన్నారు. వైపరీత్యాలు చెప్పి రావు.. సమర్థతతో పనిచేాయాని ప్రభుత్వానికి చురకలు అంటించారు.

గతంలో విశాఖలో హుద్ హుద్ తుఫాన్ వస్తే .. కేవలం వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కబెట్టామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వర్షాలు కురుస్తాయిని తెలిసినా.. పింఛ, అన్నమయ్య ప్రాజెక్ట్ లను ఎందుకు అప్రమత్తం చేయలేకపోయాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముందే నీటిని విడుదల చేస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదు కదా అని అన్నారు. వివిధ పంటకు నష్టపరిహారాలను పెంచి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు.