సోనూ సూద్ కి బిగ్ షాక్… ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన సోదరి

-

హెల్పింగ్ స్టార్ సోనూసూద్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నిక ముందు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈరోజ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాగం వెలువడిన పంజాబ్ ఫలితాల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఓడిపోయారు. పంజాబ్ లోని మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున మాళవిక పోటీ చేశారు. 

ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో మాళవిక సూద్.. ఆప్‌కి చెందిన డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరా చేతిలో 20,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. ఆప్ అభ్యర్థి 58813 ఓట్లతో భారీ విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి మాళవికా సూద్ 38125 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాళవిక సూద్. చేరిక సమయంలో సోనూ సూద్ కూడా పాల్గొన్నారు.

కరోనా సమయంలో చాలా మంది ప్రజలను తమ స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు సోనూసూద్. అనేక మంది ప్రజలకు సహాయసహకారాలు అందిచారు…. వారి ఆరోగ్యాలు బాగు చేసేందుకు ఆర్థిక సహాయం కూడా చేశారు. అయితే ఇన్ని చేసినా.. సోదరి మాళవిక సూద్ ను గెలిపించలేకపోయాయి. ఆప్ హవాలో పంజాబ్ లో కాంగ్రెస్ కొట్టుకుపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news