సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని సోనూ సూద్ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్షలు రాయాలని బలవంతం చేయకూడదని, ఈ పరీక్షలు మరో 2 నెలలు వాయిదా వేయాలని ఆయన కోరారు. వారు మానసికంగా సిద్ధమైనప్పుడే పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలు రాసే చాలా మంది పిల్లలు వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్నారన్నారు. ఈ టైంలో వారిని పరీక్షలు రాయమనడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు.
#NEETJEE परीक्षा में बैठने वाले बच्चे सुदूर इलाकों से आते हैं।बिहार के किसी गांव में बाढ़ है तो किसी जिले में पूरी बंदी। हां,परीक्षा जरूरी है लेकिन उन युवा कंधो की हिफ़ाज़त भी उतनी ही जरूरी है।पूरे विश्व में सबकुछ प्रकृति के सामने ठहर गया तो परीक्षा को कुछ वक्त के लिए टालना चाहिए pic.twitter.com/QABfYbPcsX
— sonu sood (@SonuSood) August 25, 2020
అయితే సోనూసూద్ చేసిన ఈ డిమాండ్ పై అనేకమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మద్దతు పలుకుతున్నారు. 26 లక్షల మంది విద్యార్థుల గొంతు సోనూసూద్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, జేఈఈ మెయిన్ సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు, నీట్ సెప్టెంబర్ 13న జరగనుంది. అదేవిధంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్ 27న జరగనుంది.
అయితే కరోనా అనుమానితులకు ఐసోలేషన్ గదిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలను వాయిదా వేయాలని ఆయనేకమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.