ఏపీలో కరెంట్ కోతలు కష్టాలు ఉన్న సంగతి తెలిసిందే. వినియోగం ఎక్కువై… ఉత్పత్తి భారీగా తగ్గిపోవడం కారణంగా ఏపీలో గత ఆరు నెలలుగా కరెంటు కోతలు ఉంటున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో.. కరెంట్ కోతలపై జగన్ సర్కార్ ను విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. అయితే.. తాజాగా కరెంట్ కోతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీ కరెంట్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయని ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి.
త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో 6 అణు విద్యుత్ రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారని విజయసాయి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి 1208 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం కలిగిన 6 రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి వివరించారని తెలిపారు. అయితే.. ఇవి దేశీయంగా తయారైన రియాక్టర్లు కాకపోయినప్పటికీ… రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చుతాయన్న నమ్మకం ఉందని ఆయన తెలిపారు.
In a written reply to my query in Rajya Sabha, Minister of Science & Technology @DrJitendraSingh informed that 6 reactors of 1208 MW each are proposed to be set up in Srikakulam district. Although not indigenous these reactors will surely cater to power demands in AP.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 5, 2022