క్రికెట్ ప్రేమికులు ప్రపంచ కప్ తరువాత అంతగా ఇష్టపడే టోర్నీ ఐపీఎల్…! అందరూ ఐపీఎల్ ఎప్పుడా..? అని ఎదురుచూస్తున్నారు, కానీ బీసీసీఐ కు మాత్రం ఐపీఎల్ పెద్ద సవాళ్ళనే విసురుతుంది. ఆ సవాళ్ళకు తోడుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఐసీసీ లు కూడా బీసీసీఐ కు కావాలనే చిక్కులు తెచ్చి పెట్టాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ బీసీసీఐ కు దాదాపుగా 4000 కోట్ల బిజినెస్ ను తెచ్చి పెడుతుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు ఎలాగైనా అడ్డుపడాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరోపక్క క్రికెట్ ప్రేమికులను బీసీసీఐ ఎప్పుడూ నిరాశ పరచదు దాంతో ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ ను మాత్రం మిస్ కానివ్వకుండా చూస్తుంది. అందుకుగాను తగిన సన్నాహాలు ప్రారంభించేస్తుంది.
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేధికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని వాయిదా వేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భావిస్తోంది. కానీ వాయిదాపై తుది నిర్ణయాన్ని మాత్రం గత రెండు నెలలుగా ఐసీసీ వాయిదా వేస్తూనే ఉంది. దాంతో టీ20 వరల్డ్‌కప్ విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని ఆశిస్తున్న బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. మరోపక్క అదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్ లీగ్ ను ఆసియా కప్ ను ప్రారంభించాలని పీసీబీ సన్నాహాలు చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఐపీఎల్ కు పెద్ద సవాళ్ళుగా మారి కూర్చున్నాయి. బీసీసీఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ ను నిర్వహించేందుకే చూస్తుంది ఇందుకు గాను శ్రీలంక ను దుబాయ్ ను ఎంచుకుంది. ఆ రెండు వేదికల్లో ఐపీఎల్ ను నిర్వహించాలని ఆలోచనలో ఉంది అందుకు గాను ఆ దేశాలతో ఐపీఎల్ లో పాల్గొనే క్రికెటర్లతో ఇది వరకే చర్చలు ప్రారంభించేసింది.