ఒక్క రోజులో అంబానీ, మోడీలు కాలేరని తాజాగా బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, బీజేపీ రాజకీయాలకు బలి అయినట్లు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి త్వరలోనే తప్పుకోబోతున్న గంగూలీకి ఐపీఎల్ చైర్మన్ పదవిని ఆఫర్ చేశారని, అయితే గంగూలీ దానిని సున్నితంగా తిరస్కరించాలని బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది.
దీంతో బీజేపీ పార్టీలోకి రాకపోవడం వల్లే గంగూలీని కాదని, బీసీసీఐ పదవిని బిన్నీకి అప్పగిస్తున్నారని నేషనల్ మీడియాలో వార్తలు పుంకానుపుంకాలుగా వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై స్వయంగా BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను 5 సంవత్సరాలు క్రికెట్ అసోసియేషన్ బెంగాల్ అధ్యక్షుడిగా పని చేశాను. 3 సంవత్సరాలు BCCI అధ్యక్షుడిగా పనిచేశానని గుర్తు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత, మీరు అందరూ వదిలి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. మీరు ఎప్పటికీ క్రికెట్ ఆడలేరు & అడ్మినిస్ట్రేటర్‌గా ఉండలేరు. ఆటగాడిగా & అడ్మినిస్ట్రేటర్‌గా నాణేనికి రెండు వైపులా చూడడం చాలా బాగుందన్నారు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ. ఇక నుంచి నా పని నేను చూసుకుంటా అని తెలిపారు.
I was president of Cricket Association Bengal for 5 yrs & served as president of BCCI for 3 yrs. After tenure gets over,you've to go. You can't play & remain an administrator forever. It was great seeing both sides of the coin as a player & administrator: BCCI Pres Sourav Ganguly pic.twitter.com/SSdmBzTKc4
— ANI (@ANI) October 13, 2022