దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కరోనా పాజిటివ్… సెల్ఫ్ క్వారంటైన్ లో చికిత్స…!

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కరోనా భారిన పడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కరోనా బారిన పడ్డారు. దాంతో ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. సిరిల్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోస్ లు వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సిరిల్ కు కరోనా సోకడం తో ప్రస్తుతం ఉపాధ్యక్షుడు డేవిడ్ ఆయన విధులను నిర్వహిస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇక రీసెంట్ గా సిరిల్ నాలుగు పశ్చిమ ఆసియా దేశాలకు సందర్శించారు.

ఆ తరవాత కరోనా పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కానీ ఈ నెల 8న స్వల్ప అనారోగ్యం కారణంగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడం తో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తం గా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ లోనూ ఒమిక్రాన్ చాప కింద నీరులా పాకుతోంది. ఇప్పటికే దేశంలో 38 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది.