క్లాసెన్‌ వీరబాదుడు.. టీమిండియాకు తప్పని ఓటమి..

-

తొలి టీ20 ఓటమి నేపథ్యంలో రెండో మ్యాచ్​తోనైనా తిరిగి ఫామ్​లోకి రావాలనుకున్న టీమ్​ఇండియాకు నిరాశే మిగిలింది. సఫారీలు మరోసారి విజృంభించారు. అటు బ్యాటింగ్​.. ఇటు బౌలింగ్​తో చెలరేగారు. ఫలితంగా టీమ్​ఇండియాపై నాలుగు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. తొలి టీ20లో టీమిండియా పాలిట డేవిడ్ మిల్లర్, వాన్ డర్ డుసెన్ విలన్లలా పరిణమిస్తే, ఈసారి ఆ పాత్రను వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ పోషించాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన క్లాసెన్ కేవలం 46 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టును గెలుపు ముంగిట నిలిపాడు. క్లాసెన్ స్కోరులో 7 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి.

India vs South Africa 2022 Series: Get IND vs SA News, Results, Schedule,  Highlights, Scorecard along with Match Reports and Analysis | Hindustan  Times

అంతకుముందు కెప్టెన్ టెంబా బవుమా 35 పరుగులు చేయగా, చివర్లో డేవిడ్ మిల్లర్ 20 (నాటౌట్) పరుగులు చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, చహల్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ రేపు విశాఖపట్నంలో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news