కింగ్ ఆఫ్ ది టాక్ షోస్.. కాఫీ విత్ కరణ్ సీజన్-8 త్వరలోనే రాబోతోందట. ఈ షో దేశవ్యాప్తంగానే కాదు ఇంటర్నేషనల్ స్థాయిలోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా.. సీజన్ 8 కోసం ఆడియెన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నెక్ట్స్ సీజన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సారి ఈ టాక్ షోలో ఎక్కువమంది సౌత్ స్టార్‌లు పాల్గొననున్నారట.
గతేడాది సీజన్ లో ప్రభాస్, రానా, విజయ్ దేవరకొండ, సమంత వంటి సౌత్ స్టార్లు పాల్గొన్న విషయం తెలిసిందే. అయితేే తాజా సీజన్ లో.. ఇటీవల దక్షిణాది సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన సౌత్ హీరోలు కొందరు మెరవనున్నారనే టాక్ వినిపిస్తోంది. వీరిలో అల్లు అర్జున్, యశ్, రిషబ్ శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ హీరోలతోపాటు వారి భార్యలు కూడా ఈ షోకు వస్తున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.