బ్రేకింగ్ : సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

-

ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమానికి స్పందన లభించింది. సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

Why is Jagan not appearing for hearing, asks special CBI court- The New  Indian Express

ఇదిలా ఉంటే..సోమవారం సీపీఎస్ పై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్ధిక మంత్రి బుగ్గన, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నుంచి బొప్పరాజు, సూర్యనారాయణ పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలపై చర్చించిన అనంతరం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి తుదినివేదికను సీఎం జగన్ కు అందజేయనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news