ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఊహించని విధంగా ప్రత్యర్థి జట్లపై కొన్ని జట్లు విరుచుకుపడుతున్నాయి. అయితే నేడు ముంబాయి లోని వాంఖడే స్టేడియం వేదికగా కింగ్స్ తలపడుతున్నాయి. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టనుంది. అయితే ఈ సీజన్లో 70 మ్యాచ్ లు ఉండగా నేడు జరుగుతున్న మ్యాచ్ 38వది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సీఎస్ కే బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 142 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన రాజపాక్స.. బ్రావో బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇలా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(88) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో బ్రావో రెండు, తీక్షణ ఒక వికెట్ సాధించాడు.