మన ‘ లోకం ‘ మనసులో మాట :  కులం .. కులం .. కులం .. ఏపీ సర్వ నాశనం..!!

-

ప్రపంచంలో ఎక్కడా లేని కులగజ్జి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందని చాలామంది అంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారి ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారని మర్యాదలు చేస్తారని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఇంటికి వెళితే ముందుగా మీ కులం ఏంటి అడుగుతారని అనే నానుడి ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో రెడ్డి మరియు కమ్మ సామాజికవర్గాల మధ్య రసవత్తరమైన రాజకీయం నడుస్తుంది. రెండు సామాజిక వర్గాలు తప్ప మూడో సామాజిక వర్గాన్ని ఎంటర్ చేయకుండా ఈ  రెండు సామాజిక వర్గాలకు చెందిన మహామహులు రాజకీయ చిత్రాన్ని చేస్తారని చాలా మంది అంటారు. Image result for కులంప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకుడు జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడు. దీంతో స్థానిక ఎన్నికలు విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సీఎం జగన్. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి రాష్ట్రం బాగుపడకుండా, అభివృద్ధి చెందకుండా చంద్రబాబు డైరెక్షన్లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. మరోపక్క ఎన్నికల కమిషనర్ మాత్రం కరోనా వైరస్ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా ఉండటంతో నే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

 

ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ టిడిపి నాయకులు మాత్రం అధికారంలో ఉన్నాం కదా అని వైసిపి అన్ని స్థానాలను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేయాలని చూస్తోందని విమర్శిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదా కులం కులం కులం చుట్టూ నడుస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news