కేసీఆర్ గెలుపుకోసం ఏపీలో ప్రత్యేక పూజలు..మొక్కుల చెల్లింపు..

-

తెరాస అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ లో ఆయన వీరాభిమానులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లిస్తున్నారు. దీంతో కేసీఆర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అని తెలుస్తోంది.  తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అన్నవరం పుణ్యక్షేత్రంలో ఆంధ్రా కేసీఆర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు  సత్యదేవుని ఆలయం ఎదుట 100 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…పేద ప్రజల సంక్షేమంతో పాటు, రైతుల సమస్యలు తీర్చుతున్న కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. కేసీఆర్ ఆశించిన 100 సీట్ల కంటే అధికంగానే వచ్చి ఇటు తెలంగాణలోనూ అటు జాతీయ స్థాయిలోనూ ఆయన చక్రం తిప్పాలని ఆయన తెలిపారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేశ్‌.. ఏకంగ తన నాలుక కోసుకున్నారు.

బుధవారం సాయంత్రం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని స్థానిక వెంకటేశ్వర ఆలయానికి వెళ్లి కేసీఆర్ గెలుపు కోసం దేవుడ్ని వేడుకుని అనంతరం తన నాలుక కోసుకొని ముడుపుగా హుండీలో వేశాడు. అక్కడే ఉన్న భక్తులు ఆ ఘటన చూసి హతాశులయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కి ఏపీలో పెద్ద ఫాలోయింగ్ ఉంది అనేది అర్థం అవుతోంది.  నాడు దుర్గమ్మకు మొక్కులు చెల్లింపు కోసం కేసీఆర్‌ విజయవాడకు వెళ్లగా కేసీఆర్‌ ఫ్లెక్సీలు, తెరాస జెండాలు భారీగా దర్శనమిచ్చాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ఫీవర్‌ నడుస్తుండగా ఏపీలోనూ ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news