మిర్చి కోతల సమయంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

మిరప పంట సాగు చేసే రైతులు కోత సమయానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. పంట దిగుబడి, నాణ్యత పెంచటానికి చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడుకోసి ఆరపెట్టుకోవాలి.. లేకుంటే బూజు పట్టే ఛాన్స్ కూడా ఉంది. కాయలు ఆరబెట్టుకునేందుకు పట్టాలు కాని, సిమెంట్ ఫ్లోర్ పైన కానీ ఆరబెట్టాలి. నేరుగా మట్టి నేలపై ఆరబెట్టరాదు. చెట్టుపైనే మిరప కాయలను పూర్తిగా పండనీయకుండా చూసుకోవాలి. పూర్తిగా పండితే నాణ్యత తగ్గుతుంది.. పూర్తిగా కాయలు పండితే ఎండిన తర్వాత నాణ్యత తగ్గుతుంది..

 

ఇకపోతే.. కాయలు కోసేముందు సస్యరక్షణ మందులు పిచికారీ చేయకూడదు. ఆప్తోటాక్సిన్‌ వృద్ధికాకుండా మిరపకాయలను పాలిథీన్‌ పట్టాలమీద లేదా సిమెంట్‌ గచ్చుమీద ఎండబెట్టాలి. రాత్రి సమయంలో మంచుబారిన పదకుందా కాయలను కప్పిఉంచాలి. మిరపలో. 10 శాతానికి మించి ఎక్కువ తేమ ఉండకుండా చూడాలి. ఎండ బెట్టే సమయంలో చెత్త, దుమ్ము ధూళి లేకుండా కాయలను శుభ్రంగా ఉండేటట్లు చేయాలి..
అలాగే కాయలు ఎండబెట్టే ప్రదేశానికి జంతువులు రాకుండా చూసుకోవాలి.

తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్‌ చేసి వేరు చేయాలి. నిల్వ చేయడానికి తేమలేని శుభ్రమైన గొనే సంచుల్లో కాయలు నింపాలి. తేమ తగలకుండా వరిపొట్టు లేదా చెక్కబల్లలమీద గోడలకు దూరంలో నిల్వఉంచాలి. అవసరమైతే శీతల గిడ్దంగుల్లో నిల్వచేస్తే రంగు, నాణ్యత తగ్గకుండా లాభదాయకంగా ఉంటుంది.. కాయలు మంచి రంగు ఉండాలంటే రసాయనాలను, రంగులను వాడకూడదు. అకాల వర్షాలకు గురికాకుండా, మంచుబారిన పడకుండా రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలో గానీ లేదా టోబాకోటారెన్‌లో గానీ, ఎండబెట్టి నాణ్యమైన మిరప కాయలను పొందవచ్చు.. మరింత సమాచారం కోసం వ్యవసాయ నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news