శృంగార తార‌తో రవితేజ స్పెష‌ల్ సాంగ్‌..!

-

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు.

అయితే.. ప్రస్తుతం ఈ సినిమాలో సీసీ.. అనే స్పెషల్‌ సాంగ్‌ ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో శృంగార తారగా పేరు పొందిన అన్వేషి జైన్‌ నటిస్తున్నారని టాక్‌. హిందీలో అడల్డ్‌ సిరీస్‌ గాపేరున్న గంధీ బాత్‌ లో అన్వేషి జైన్‌ నటించి హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. హీరోయిన్స్‌, ఇంకేవరినో నటింప చేయడం కంటే అన్వేషి జైన్‌ అయితే పాటకు మరింత క్రేజ్‌ వస్తుందని చిత్ర బృందం భావించి.. ఆమెనే ఫైనల్‌ చేసింది. ఇక ఈ సాంగ్‌ లో రవితేజ కూడా నటిస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news