HBD Pooja Hegde: 10 ఏళ్లలో కోటాను కోట్లు… పూజా హెగ్డే సంపాదన చూస్తే అవాక్కవ్వాల్సిందే!!

-

పూజా హెగ్డే.. ప్రస్తుతం ఈ పేరుకు ఎంత క్రేజ్ వుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 13న ఈమె పుట్టినరోజు. పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే ఈ ఏడాది బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో సందడి చేసింది.

పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది. తల్లి దండ్రులది కర్ణాటకలోని మంగళూరు అయినా.. వీళ్లు సెటిల్ అయింది మాత్రం ముంబైలో. తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. అంతేకాదు పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది.

బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది.

ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది.పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూజ 2010లో విశ్వసుందరీ పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. తెలుగులో రెండు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్‌లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ‘మెహెన్ జోదారో’ సినిమాతో మెప్పించింది.

ప్రస్తుతం పూజకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆస్తి 51 కోట్లు దాకా ఉంది. రెమ్యునరేషన్ 5 కోట్ దాకా తీసుకుంటుండగా.. ఏడాదికి 2,3 సినిమాలు చేసినా… సుమారుగా నెలకి 2 నుంచి 3 కోట్లు దాకా సంపాదిస్తోంది. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఈ భామ నటిస్తోంది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మనలోకం టీం.

Read more RELATED
Recommended to you

Latest news