Breaking : కొండాపూర్‌లో ఎయిర్‌లైవ్‌ పబ్‌ లైసెన్స్‌ రద్దు

-

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎయిర్ లైవ్ పబ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు మాదాపూర్‌ పోలీసులు. ఈ క్రమంలో పబ్ ఓనర్, మేనేజర్, డీజే సింగర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. అనంతరం డీజే సాంగ్స్ కు సంబంధించిన సామాగ్రిని సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల రాత్రి 10 గంటల తర్వాత పబ్ లలో మ్యూజిక్ సిస్టం ఉపయోగించవద్దని హైకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

Air Live Jubilee Hills - Live music bar in Hyderabad, India |  Top-Rated.Online

నిర్దేశించిన సౌండ్ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఎయిర్ లైవ్ పబ్ పై కేసు నమోదు చేశారు. అయితే.. తాజాగా కొండాపూర్‌లో ఎయిర్‌ లైవ్‌ పబ్‌ లైసెన్స్‌ రద్దు చేసినట్లు మాదాపూర్‌ డీసీపీ వెల్లడించారు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన 12 పబ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు రాత్రి 10 తర్వాత పబ్‌ల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే పబ్‌ లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news