టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబై

-

ఐపీఎల్ 2022 సీజ‌న్లో భాగంగా ఈరోజు ప‌టిష్ట‌మైన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను ముంబై ఇండియ‌న్స్ ఢీకొట్ట‌నుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే నేడు ఐపీఎల్‌-2022లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ అద్భుతం‍గా రాణిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌ వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై అన్నింట్లోనూ ఓటమి చెందింది. అయితే ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని ముంబై పట్టుదలతో ఉంది.

తుది జట్లు :

రాజస్తాన్ రాయల్స్ : దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, డారిల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిధ్ కృష్ణ యుజ్వేంద్ర చహల్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకీన్, డానియల్ సామ్స్, టిమ్ డేవిడ్, కుమార్ కార్తీకేయన్, రిలే మెరెడిత్, జస్ప్రీత్ బుమ్రా

 

Read more RELATED
Recommended to you

Exit mobile version