స్విట్జర్లాండ్‌లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అడ్వెంచర్

-

భారత జావెలిన్ స్టార్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్‌ విహార యాత్రలో జాలీగా గడుపుతున్నాడు. డైమండ్ లీగ్ విజయోత్సాహంలో ఉన్న గోల్డెన్ బాయ్ విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. అక్కడ సందర్శించిన ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఖుష్ చేస్తున్నాడు. తాజాగా నీరజ్ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ అదేంటంటే.. స్విట్జర్లాండ్‌ విహారయాత్రలో ఉన్న నీరజ్ చోప్రా తాజాగా స్కై డైవింగ్ చేశాడు. ఈ అడ్వెంచర్‌కు సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి ‘‘ఆకాశం హద్దే కాదు..’’ అనే క్యాప్షన్‌ను జతచేశాడు. ఆకాశం మధ్యలో విమానం నుంచి దూకే సమయంలో నీరజ్‌ చాలా ఉత్సాహంగా కనిపించాడు. ఈ వీడియో మొత్తంలో చిరునవ్వులు చిందిస్తూ స్కైడైవ్‌ను ఆస్వాదించాడు. రెండు రోజుల్లోనే ఈ వీడియోకు దాదాపు నాలుగు లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. ‘నువ్వు జావెలిన్‌లో స్టారే.. స్కై డైవింగ్‌లోనూ స్టారే’ అంటూ నీరజ్ సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news