చేతులెత్తేసిన అఫ్గాన్‌ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా టార్గెట్ 57

-

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ట్రినిడాడ్‌ వేదికగా జరుగుతున్న సెమీఫైనల్‌-1 మ్యాచ్‌లో అఫ్గాన్‌ చేతులెత్తేసింది. 56 పరుగులతోనే ఇన్నింగ్స్‌ ముగించింది. ఈ టోర్నీలో మొదటి నుంచి అసాధారణ ప్రతిభ కనబరిచిన అఫ్గాన్‌ బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో కుదేలయ్యారు. 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకు ఆలౌటయ్యారు. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (10) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

దక్షిణాఫ్రికా బౌలర్లు వరుస వికెట్లు పడగొడుతూ అఫ్గాన్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్లు గుర్బాజ్‌ (0), జర్దాన్‌ (2), తొలి డౌన్‌లో వచ్చిన గుల్బాదిన్ నైబ్ (9) పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒమర్జాయ్‌ ప్రయత్నించినా నోకియా బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (8) కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. నబీ (0), జనత్‌ (8), నూర్ ఆహ్మద్‌ (0), నవీనుల్‌ హక్‌ (2) ప్రభావం చూపించలేకపోయారు. ఫరూకీ (2*) నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్‌, షంసీ చెరో 3 వికెట్లు తీయగా.. రబాడా, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news