BREAKING : అజరుద్దీన్ కు షాక్‌..HCAపై మరో కేసు నమోదు..

-

HCA చీఫ్‌ అజరుద్దీన్ కు షాక్‌ తగిలింది. హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేస్ నమోదు అయింది. హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, హెచ్ సీఏ మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు రాచకొండ సిపి కి కంప్లైంట్ అందజేశారు. గత సెప్టెంబర్ 26తో హెచ్ సి ఏ ప్రెసిడెంట్ అజరుద్దిన్ గడువు ముగిసింది.

తనకు గడువు ముగిసిన కూడా తప్పుడు డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి బిసిసిఐ.. ఈసీ కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా అజరుద్దీన్ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవి కాలం పై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తరువులు జారీ చేశారని ఫిర్యాదులో పొందుపరిచారు.

ఈ నెల 18 న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరు అయ్యేందుకు అజరుద్దీన్ తన పదవి సమయాన్ని పొడిగించుకున్నట్లు కంప్లైంట్ లో ఆరోపించారు. దీనిపైనా పై క్రిమినల్ కేసు కింద ఐపీసీ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ కి ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news