ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తమ ఆటగాళ్ల కోసం వాటర్ బాయ్ అవతారం ఎత్తారు. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇవ్వగా.. ఆస్ట్రేలియా టీమ్ క్యాప్ ధరించిన ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ఆటగాళ్ల కోసం డ్రింక్స్ తీసుకుని మైదానంలోకి పరుగెత్తుకెళ్లాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశ ప్రధాని రిజర్వ్ ప్లేయర్‌లాగా మారారడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తూ గ్రౌండ్ నుంచి వెళ్లిపోయారు.ఈ క్రమంలోనే ‘ఆసీస్ క్రికెట్లకు వాటర్ బాయ్‌గా సేవలు అందించి ప్రధాని స్కాట్ మారిసన్.. ఈ ప్రపంచంలో ఏ పనిని కూడా తక్కువగా చూడకూడదని నిరూపించారు. అదే విధంగా క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని స్కాట్ మోరిస ఈ రకంగా చాటుకున్నారు.