ఇంగ్లండ్‌కు మ‌ళ్లీ త‌ప్ప‌ని ఓట‌మి.. ఆస్ట్రేలియా ఘ‌న విజయం..!

-

ఐసీసీ వ‌రల్డ్ క‌ప్ 2019 టోర్నీ ఆరంభంలో విజ‌యాల ప‌రంప‌ర‌తో దూసుకెళ్లిన ఇంగ్లండ్ జ‌ట్టు ఇప్పుడు ఓట‌ములతో వెనుక‌బ‌డుతోంది. ఇవాళ ఆసీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ ఓడిపోయింది.

ఐసీసీ వ‌రల్డ్ క‌ప్ 2019 టోర్నీ ఆరంభంలో విజ‌యాల ప‌రంప‌ర‌తో దూసుకెళ్లిన ఇంగ్లండ్ జ‌ట్టు ఇప్పుడు ఓట‌ములతో వెనుక‌బ‌డుతోంది. ఇవాళ ఆసీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ ఓడిపోయింది. ఆ జ‌ట్టు నిర్దేశించిన 286 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఇంగ్లండ్ 44.4 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడి 221 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై 64 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

లార్డ్స్ మైదానంలో ఇవాళ ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసి.. 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 285 ప‌రుగుల స్కోరు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (116 బంతుల్లో 100 పరుగులు, 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ఓపెనర్ డేవిడ్ వార్నర్ (61 బంతుల్లో 53 పరుగులు, 6 ఫోర్లు)లు రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ కు 2 వికెట్లు ద‌క్క‌గా, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీల‌కు తలా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆరంభం నుంచి త‌డ‌బ‌డుతూ వ‌చ్చింది. ఓ ద‌శ‌లో 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ‌గా, ఆ జ‌ట్టును బెన్ స్టోక్స్ (115 బంతుల్లో 89 పరుగులు, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ ఇంగ్లండ్ ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోవ‌డంతో ఆ జ‌ట్టు చివ‌ర‌కు ప‌రాజ‌యం పాలైంది. కాగా ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 5 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ 4, మార్కస్ స్టాయినిస్ 1 వికెట్ తీశాడు.

Read more RELATED
Recommended to you

Latest news