బాలయ్యకు షాక్.. బీజేపీలో చేరిన ఆయన బంధువు

-

ఈసారి టీడీపీకే కాదు.. బాలయ్య బాబుకు కూడా గట్టి దెబ్బ తాకింది. అదేనండి.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించే మనం మాట్లాడుకునేది. ఆయన బంధువు పొట్లూరి కృష్ణ బాబు బీజేపీలో చేరారు. ఆయన టీడీపీ నాయకుడు. పామర్రుకు చెందిన పొట్లూరి బాలకృష్ణకు దగ్గరి బంధువు. అయినప్పటికీ.. ఆయనకు షాక్ ఇస్తూ ఇవాళ బీజేపీలో చేరారు. తన భార్యతో కలిసి బీజేపీలో చేరారు.

బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీకి ఇప్పటికే పలు దెబ్బలు తాకాయి. ఎప్పుడైతే టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయిందో అప్పటి నుంచి టీడీపీ ఖేల్ ఖతమయింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు టీడీపీ నాయకులంతా పడిపోయారు. ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. మరో టీడీపీ నేత అంబికా కృష్ణ కూడా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు పొట్లూరి.. రేపు ఎవరో? మాజీ మంత్రి గంటాతో పాటు టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news