బంగ్లా క్రికెటర్లు ఇంత లేకిగాళ్లేంట్రా బాబూ…!

-

క్రికెట్ అనేది ఒక జెంటిల్ మెన్ గేమ్. ఆటలో ఎంతో హుందాగా ప్రవర్తించాలి. అది చాలా అవసరం కూడా. నీకు ఎన్ని భావోద్వేగాలు ఉన్నా సరే అదుపులో ఉంచుకుని ప్రవర్తించాలి. కాని బంగ్లాదేశ్ జట్టు మాత్రం ఈ విషయంలో ఎప్పుడూ లేకిగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. బంగ్లాదేశ్ సీనియర్ జట్టు అయినా, యువ జట్టు అయినా సరే ఇదే విధంగా చండాలంగా మైదానంలో ప్రవర్తిస్తూ విమర్శల పాలవుతుంది.

వాళ్ళ వ్యక్తిత్వాలు విజయం ముందు బయటపడుతూ ఉంటాయి. విజయం సాధించిన తర్వాత లేకి ప్రవర్తనతో ఎదుటి వాళ్లకు బీపీ పెంచుతూ ఉంటారు. మైదానంలో పరుగులు తీయడం బాగానే ఉంటుంది గాని ఆ వేసే డాన్స్ లు చేసే సంజ్ఞలు ఇవన్ని కూడా వాళ్ళల్లో ఉన్న పొగరుని బయటపెడుతూ ఉంటాయి. బంతి వేసిన ప్రతీసారి ప్రతీ బౌలర్ బ్యాట్స్మెన్ ని రేచ్చాగోడుతూనే ఉంటాడు.

తాజాగా ముగిసిన అండర్ 19 ప్రపంచకప్ లో కూడా ఇదే జరిగింది. దీనితో భారత యువ ఆటగాళ్లకు మెంటల్ వచ్చినంత పని అయింది. కొట్టడానికి కూడా వెళ్ళిపోయారు మన వాళ్ళు. గెలిచిన తర్వాత హేళనగా మాట్లాడుతూ మన జట్టుని చూసి వెక్కిరించారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

వాళ్ళు వచ్చి మన వాళ్ళను రెచ్చగొట్టగా… మన వాళ్ళు కొట్టబోయారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న సహాయక సిబ్బంది వెంటనే వాళ్ళను విడదీసారు. దీనిపై బంగ్లా సారధి క్షమాపణలు చెప్పాడు. ఇక మన కెప్టెన్ ప్రియం గార్గ్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇలాంటి ప్రవర్తన మంచిది కాదని అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. బంగ్లా క్రికెటర్లు ఇంత లేకి గాళ్ళు ఎంట్రా బాబూ…? అంటూ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news