IPL 2023 : పంజాబ్ కోసం బరిలోకి సన్‌ రైజర్స్‌ కోచ్‌ !

-

ఐపీఎల్ 2023 తరుముకొస్తున్న వేళ.. అన్ని జట్లు మార్పులకు రంగం చేస్తున్నాయి. ఇటీవలే SRH యాజమాన్యం హెడ్ కోచ్ టామ్ ముడీ ని తప్పిస్తూ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు కోచింగ్ పగ్గాలు అప్పజెప్పగా, తాజాగా పంజాబ్ కింగ్స్ సైతం పాత కోచ్ అనిల్ కుంబ్లే పై వేటు వేసి, సన్రైజర్స్ మాజీ కోచ్, 2019 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీం కోచ్ ట్రేవర్ బేలిస్ కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

స్వతహాగా ఆస్ట్రేలియన్ అయిన బేలిస్ 2020, 2021 సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్ కు హెడ్ కోచ్ గా, అంతకుముందు 2012, 2014 ఐపీఎల్ ఛాంపియన్ కేకేఆర్ కు సపోర్టింగ్ స్టాఫ్ హెడ్ కోచ్ గా వ్యవహరించాడు.

2019 నుంచి పంజాబ్ హెడ్ కోచ్ గా ఆపరేషన్ డైరెక్టర్ గా సేవలందిస్తున్న కుంబ్లే తో ఒప్పందం గడువు ముగియడంతో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆటగాడిగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోయినా కోచ్ గా ఘనమైన రికార్డు కలిగి ఉండటంతో పంజాబ్ బేలిస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news