అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న గోల్కొండ పోలీసులు

-

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు గోల్కొండ పోలీసులు. పక్కా సమాచారంతో నలుగురు నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా గోల్కొండ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. ఆదిల్ అనే వ్యక్తి రేషన్ బియ్యం తరలింపులో కీలకంగా ఉన్నాడని తెలిపారు. నలుగురిని ఎంగేజ్ చేసుకుని రేషన్ కార్డ్ హోల్డర్స్ నుండి బియ్యాన్ని సేకరిస్తాడని.. బియ్యం సేకరించిన అనంతరం రాజేంద్ర నగర్ లిమిట్స్ లో ఉంటున్న ఇమ్రాన్ కు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

అదిల్, ఇమ్రాన్ కు కాల్ చేస్తే వెహికల్ డ్రైవర ను పంపుతాడని తెలిపారు. వంద బస్తాల బియ్యం సీజ్ చేసామన్నారు గోల్కొండ ఇన్స్పెక్టర్. అందులో క్వాలిటీ బియ్యం యాభై క్వింటాళ్ల వరకు ఉన్నట్లు అంచనా వేసేయమన్నారు. బియ్యం తరలింపుకు సిద్దంగా వాహనం సీజ్ చేసామన్నారు. ఇందులో రేషన్ డీలర్ల పాత్ర గురించి అరా తిస్తున్నామని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి సేకరించిన బియ్యాన్ని ఫౌల్ట్రి ఫార్మ్ లకు విక్రయిస్తున్నట్టు తెలిసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news