టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది బీసీసీఐ. రిషబ్ పంత్ ను టీమ్ ఇండియా వైస్ కెప్టెన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పండిత ఫిబ్రవరి 16న తేదీ నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ టీ20 సిరీస్ టీమ్ ఇండియా జట్టుకు వైస్ క్యాప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన వైస్ కెప్టెన్… కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియామకం చేసింది బీసీసీఐ. ఇటీవల జరిగిన వెస్టిండీస్ వన్డే సిరీస్ లో మొదటి వన్డేకు కె.ఎల్.రాహుల్ దూరమయ్యాడు.
తన సోదరి వివాహం కొరకు అతడు మొదటి వన్డే ఆడలేదు. రెండు వన్డేలు ఆడిన ఆ మ్యాచ్ లో అతను గాయాలపాలయ్యాడు. అంతేకాదు ఈ గాయం కారణంగా మూడో వన్డే అలాగే టి20 సిరీస్ కు దూరమయ్యాడు ఈ నేపథ్యంలోనే తాజాగా కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ను నియమించింది బీసీసీఐ పాలక మండలి.