క్రికెట్ ఫాన్స్ కి పండగలాంటి న్యూస్… కీలక నిర్ణయం తీసుకున్న బోర్డ్…!

-

బీసీసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య కాలంలో క్రికెట్ మ్యాచులు లేక అసహనానికి గురవుతున్న ఫాన్స్ కి అలనాటి మ్యాచులను అందించడానికి సిద్దమైంది బోర్డ్. ఇప్పట్లో క్రికెట్ టోర్నీ లు జరిగే అవకాశం కనపడటం లేదు.కాబట్టి ప్రభుత్వ యాజమాన్యంలో పని చేసే… స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ ఛానల్ డిడి స్పోర్ట్స్ 2000 ల ప్రారంభంలో భారత క్రికెట్ మ్యాచ్‌ల హైలెట్స్ ని ఏప్రిల్ 7 నుండి ప్రసారం చేయనున్నట్లు బిసిసిఐ సోమవారం ట్విట్టర్ లో ప్రకటించింది.

“2000 ల క్రికెట్ రివైండ్! బిసిసిఐ మరియు భారత ప్రభుత్వం మీకు గతం నుండి క్రికెట్ హైలెట్స్ ని అందిస్తున్నాయి. ఇంట్లో కూర్చుని కూర్చుని @ddsportschannel మ్యాచులు ఆశ్వాదించండి అంటూ # స్టేహో హోం స్టే సేఫ్” అని బిసిసిఐ ట్వీట్ చేసింది. దీనిపై ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 85 నుంచి పుట్టిన వాళ్ళు ఈ మ్యాచులను ఎక్కువగా ఆశ్వాదిస్తారని బోర్డ్ భావిస్తుంది.

ఈ మ్యాచ్‌లలో 2003 లో భారత్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన ముక్కోణపు టోర్నీ, 2000 లో దక్షిణాఫ్రికా భారత పర్యటన, 2001 లో ఆస్ట్రేలియా భారత పర్యటన (వివిఎస్ లక్ష్మణ్ మరియు రాహుల్ ద్రావిడ్ రోజంతా బ్యాటింగ్ చేసి గెలిపించిన కోల్‌కతా టెస్టుతో సహా), 2002 లో వెస్టిండీస్ భారత పర్యటన మరియు 2005 లో శ్రీలంక భారత పర్యటన. ఇక కరోనా కారణంగా ఐపిఎల్ ని కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇది ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు.

Read more RELATED
Recommended to you

Latest news