బ్రేకింగ్; కరోనా వైరస్ తో వన్డే సీరీస్ రద్దు…!

-

కరోనా వైరస్ ప్రభావం తో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సీరీస్ ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం ధర్మశాలలో జరగాల్సిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. మరో రెండు మ్యాచులు ఉండగా లఖ్‌నవూ, ఈడెన్‌ గార్డెన్‌లో జరగాల్సి ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తుంది. దీనితో పరిస్థితిని సమీక్షించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్… సీరీస్ ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

దీనితో సఫారి జట్టు తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఐపిఎల్ టోర్నీ ని ఏప్రిల్ 15 కి వాయిదా వేసారు. విదేశీ ఆటగాళ్ళ వీసాలను కూడా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాలు కరోనా దెబ్బకు అప్రమత్తం అవుతున్నాయి. కర్నాటక సహా బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఝార్ఖండ్ సహా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు స్కూల్స్ కి సెలవలు ప్రకటించాయి.

ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం స్కూల్ కి సెలవలు ప్రకటించింది. కర్ణాటక లో కరోనా వైరస్ కి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో గూగుల్ ఉద్యోగికి వైరస్ సోకింది. దీనితో ఎప్పుడు ఎం జరుగుతుంది అనే ఆందోళన అందరిలో నెలకొంది. మన దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 81 మందికి చేరుకుంది. కొన్ని రాష్ట్రాల్లో విమాన సర్వీసులను కూడా రద్దు చేసాయి కొన్ని విమానయాన సంస్థలు.

Read more RELATED
Recommended to you

Latest news