శనివారం ముగిసిన ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ లో టీం ఇండియా పేసర్ మహ్మద్ శమీ గాయపడిన సంగతి తెలిసిందే. చివరి వికెట్ గా బ్యాటింగ్ కి వచ్చిన అతను కమ్మిన్స్ వేసిన బౌన్సర్ కి తీవ్రంగా గాయపడ్డాడు. దీనితో మిగిలిన 3 టెస్టుల్లో అతను జట్టుకి దూరం అయ్యాడని జట్టు వర్గాలు చెప్పాయి. స్కానింగ్ తీయగా గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని వెల్లడైంది.
నిన్న ముగిసిన టెస్ట్ లో టీం ఇండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్ దెబ్బకు మహ్మద్ షమీని రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. దీనితో భారత ఇన్నింగ్స్ 36 పరుగుల వద్ద ముగిసింది. షమీ గాయం గురించి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అడగగా… అతను తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్నాడు అని, అతన్ని స్కానింగ్ కోసం ఆస్పత్రికి తీసుకు వెళ్ళారని చెప్పాడు.
అతను చాలా బాధ పడుతున్నాడని చేయి కూడా ఎత్తలేకపోయాడు అని కోహ్లీ వివరించాడు. ఇప్పటికే టీం ఇండియాకు రెండో టెస్ట్ నుంచి కెప్టెన్ కోహ్లీ కూడా ఉండటం లేదు. ఈ తరుణంలో కీలక బౌలర్ గా ఉన్న శమీ గాయపడటం బాగా ఇబ్బంది పెట్టే పరిణామంగా చెప్పాలి. శమీ గాయపడటంతో బౌలింగ్ భారం అంతా కూడా బూమ్రాపై పడుతుంది. శమీ స్థానంలో ఇషాంత్ శర్మను పంపే అవకాశం ఉంది.