హెచ్‌సీఏలో సొంత వర్గమే అజార్ కి షాకిచ్చిందా

-

అవినీతి ఆరోపణలు గొడవలు..అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఎట్టకేలకు ఓ వివాదం సర్ధుమణిగింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌ నియామకంలో సొంత వర్గానికి చెందిన పాలకులే ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్‌ దీపక్‌వర్మ ను ప్రతిపాదించారు హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌. ఈ నిర్ణయాన్ని హెచ్‌సీఏ సెక్రెటరీ విజయానంద్‌తో పాటు.. అజార్‌ ప్యానెల్‌కి చెందిన సభ్యులు వ్యతిరేకించారు.

ఎన్నో అవరోధాలు ఆటంకాలు ఆందోళనల మధ్య హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌ నియామకం జరిగింది. జస్టిస్‌ దీపక్‌వర్మను అంబుబ్స్‌మెన్‌గా నియమించాలని హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజార్‌ ప్రతిపాదించగా సొంతగూటి నుంచే అజ్జూబాయ్‌కి చుక్కెదురైంది. అంబుడ్స్‌మెన్‌గా దీపక్‌వర్మ వద్దని అజార్‌ ప్యానెల్‌కి చెందిన సభ్యులే వ్యతిరేకించారు. వాదోపవాదనలు ఆరోపణలు చేసుకున్నారు. కానీ ఎట్టకేలకు దీపక్‌వర్మనే అంబుడ్స్‌మెన్‌గా నియమించుకుంది హెచ్‌సీఏ.

దీపక్‌వర్మ నియామకం విషయంలో చెలరేగిన వివాదం ముదరడంతో గతనెల ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన సర్యసభ్య సమావేశం అర్ధంతరంగా ముగిసింది. కొన్ని రోజుల విరామం తర్వాత ఇవాళ జరిగిన సమావేశంలో ఎట్టకేలకు దీపక్‌వర్మను అంబుడ్స్‌మన్‌గా నియమిస్తూ సభ్యులందరు ఏకాభిప్రాయం తెలిపారు. సమావేశంలో.. 130 మంది క్లబ్‌ మెంబర్స్‌ పాల్గొని అమోదం తెలిపారు.

కొంతమంది స్వలాభం కోసమే తన నిర్ణయాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌. కావాలనే ఆరోపణలు చేస్తున్నారని…. సమావేశంలో ఉద్దేశపూర్వకంగానే వాదనాలు చేస్తూ.. వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు అజార్‌. గత నెల జరిగిన సమావేశంలో రభసకి కారణమైన సభ్యులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా… సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. బీసీసీఐ కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉందన్నారు అజార్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news