సెహ్వాగ్ లా అతను కూడా భయం పుట్టించగలడు.. మైకేల్ వాన్.

-

ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుచుకున్న ఇండియా జట్టు ఇంగ్లండ్ పై సిరీస్ గెలుచుకుని టెస్ట్ క్రికెట్ లో ప్రథమ స్థానంలో నిలవాలని చూస్తుంది. అటు ఇంగ్లండ్ కూడా టెస్ట్ సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్, భారత ఆటగాడు రిషబ్ పంత్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. పంత్ ఆటతీరు బాగుంటుందని, సెహ్వాగ్ లా అతనూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించగలడని అన్నాడు.

BRISBANE, AUSTRALIA – NOVEMBER 23: Michael Vaughan of the BBC commentary team laughs as he waits to speak on air before play on day one of the First Test Match of the 2017/18 Ashes Series between Australia and England at The Gabba on November 23, 2017 in Brisbane, Australia. (Photo by Mark Kolbe/Getty Images)

అవతలి జట్టు బౌలర్లని చెడుగుడు ఆడే ఆట రిషబ్ లో ఉందని, కానీ కొన్ని పొరపాట్ల వల్ల అప్పుడప్పుడు తక్కువ స్కోరుకే ఔటవుతున్నాడని, లేదంటే ప్రత్యర్థుల బౌలర్లకి భయం పుట్టించగలడని తెలిపాడు. మొత్తానికి ఇంతకుముందు పంత్ పై అనేక విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ ప్రశంసల రూపంలోకి మారుతున్నాయి. మరి వాన్ చెప్పినట్టు సెహ్వాగ్ లా విజౄంభిస్తాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news