ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో ఉన్న ఏజిస్ బౌల్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జూన్ 18 నుంచి వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం విదితమే. ఈ మ్యాచ్‌కు గాను నియమ నిబంధనలను ఐసీసీ ఇది వరకే ప్రకటించింది. ఇక తాజాగా ఈ మ్యాచ్‌లో గెలుపొందే విజేతలకు, రన్నర్స్ అప్‌కు ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌లో గెలుపొందే విజేతలకు 1.6 మిలియన్ల డాలర్లను ప్రైజ్ మనీగా అందిస్తారు. అలాగే రన్నర్స్ అప్ టీమ్‌కు 8 లక్షల డాలర్లను ప్రైజ్ మనీగా అందిస్తారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో జియాఫ్ అల్లార్డైస్ ఈ వివరాలను ప్రకటించారు. కాగా ప్రస్తుతం వరల్డ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా భారత్ రెండో స్థానంలో ఉంది.
అయితే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్‌లో భారత్ 17 మ్యాచ్‌లకు 12 మ్యాచ్‌లలో గెలిచి పాయింట్ల పట్టికలో 72.2 శాతం విన్ పర్సంటేజ్‌తో మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ 7 మ్యాచ్‌లను గెలిచి 70 శాతం విన్ పర్సంటేజ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఆ ప్రైజ్ మనీని విభజించి రెండు జట్లకు అందజేస్తారు.