ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ కొడుతుందా !

-

ఈ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సీజన్ ను చాలా పేలవంగా స్టార్ట్ చేసింది, వరుసగా మొదటి మరియు రెండవ మ్యాచ్ లను బెంగుళూరు మరియు చెన్నై లపై ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా ఢిల్లీ, కోల్కతా మరియు హైదరాబాద్ జట్లను ఓడించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది రోహిత్ సేన. ఆ తర్వాత మళ్ళీ రెండు వరుస ఓటములతో గాడి తప్పినట్లు కనిపించినా మళ్ళీ విజయాల పరంపర కొనసాగించింది. గత రెండు మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ మరియు పంజాబ్ లను చిత్తు చేసింది. ఈ రోజు ధోని నేతృత్వంలో సక్సెస్ ఫుల్ గా టోర్నీలో దూసుకువెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తో మధ్యాహ్నం ఢీ కొట్టనుంది. మాములుగా సమీకరణాల ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో రోహిత్ సేనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒక్క రోహిత్ శర్మ మినహాయించి మిగిలిన ప్లేయర్స్ అందరూ ఫామ్ లోకి రావడంతో ప్రత్యర్థి ఎంతటి లక్ష్యాన్ని ముందు ఉంచినా ఛేదిస్తూ ప్లే ఆఫ్ కు చేరడానికి దగ్గర్లో ఉంది. మరి ఈ రోజు మ్యాచ్ లో చెన్నిపై గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news