చెన్నై జట్టులో ఆ లోటు స్ఫ‌ష్టంగా తెలుస్తోంది

-

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై జట్టు వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 44 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ర‌క‌ర‌కాల వాద‌న‌లు, విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. అవేంటంటే… చెన్నై ఓపెనర్లు విఫలమైన వేళ మిడిలార్డర్‌లో డుప్లెసిస్‌కు సరైన సహకారం అందలేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అంతేగాక అంబటి రాయుడు, సురేశ్‌ రైనా లేని లోటు స్పష్టంగా కనిపించిందంటూ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇదే విషయమై చెన్నై ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్‌ మ్యాచ్‌ అనంతరం స్పందించాడు.

‘చెన్నై జట్టు వరుసగా రెండో మ్యాచ్‌ ఓడిపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. రైనా, రాయుడు లాంటి ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్‌ లైనఫ్‌లో వారి స్థానాలను భర్తీ చేసేందుకు వివిధ రకాల కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నాం. నిజంగా రైనా టోర్నీకి దూరమవ్వడం బాధాకరం.. అతను నిన్నటి మ్యాచ్‌లో ఆడి ఉంటే జట్టుకు గెలిచే అవకాశాలు ఉండేవేమో. టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌లో చేదించాల్సిన టార్గెట్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడికి తట్టుకొని నిలకడగా ఆడుతూ బ్యాటింగ్‌ చేయగల ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news