కీలకమైన మ్యాచ్ లో పంజాబ్ పై ఢిల్లీ విజయం సాధించింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫ్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ఢిల్లీ. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 142 పరుగులే చేసింది. పంజాబ్ బ్యాటర్లలో జితేశ్ శర్మ 44 పరుగులు, జానీ బెయిర్ స్టో 28 పరుగులు ధావన్ 19 పరుగులు చేసి.. పర్వాలేదనిపించారు.
మయాంక్ అగర్వాల్ మాత్రం డకౌట్ అయ్యాడు. బాగా ఆడతాడని అనుకున్న లివింగ్ స్టోన్ కేవలం మూడు పరుగులు, రిషి ధావన్ 4 పరుగులు, అర్ష్ దీప్ సింగ్ 2 పరుగులు రాహుల్ చాహల్ 25 పరుగులు చేసారు. ఇక అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థికి 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ 63 పరుగులు, సర్పరాజ్ ఖాన్ 32 పరుగులు, చేసి.. ఢిల్లీకి… 160 పరుగులు అందించారు. అయితే.. ఈ లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించడంలో విఫలమైంది.