ఐపీఎల్ లో ఘోరంగా విఫలమౌవుతున్న కోహ్లీ, రోహిత్ లపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ, రోహిత్ లు ఇద్దరు గొప్ప ఆటగాళ్లని.. వారు కొత్తగా నిరూపించుకోవాల్సిన పనిలేదని చెప్పిన గంగూలీ.. వారికి రెస్ట్ అవసరమన్నారు. టీ20 ప్రపంచ కప్‌కు చాలా సమయం ఉందని.. కోహ్లీ జట్టులో ఉంటాడా లేదా అనేదిద అనవసరమైన చర్చ అని చెప్పారు.
తీరికలేని షెడ్యూల్ తో బిజీగా ఉన్న కారణంగా సౌతాఫ్రికాతో అతనికి విశ్రాంతి నిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కోహ్లీ ఒక్కడే కాదు.. రోహిత్, కేఎల్ రాహుల్ సహా మిగతా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామ ని పేర్కొన్నారు. కోహ్లీని పూర్తిగా పక్కన పెడతామనే వార్తల్లో వాస్తవం లేదని.. ఒకవేళ అతను సౌతాఫ్రికా తో సిరీస్ ఆడాలనుకుంటే.. మాత్రం ఆడతాడని.. వెల్లడించారు గంగూలీ. ఏదైనా అతన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కుండ బద్దలు కొట్టి చెప్పారు గంగూలీ.