IPL GT vs PBKS : లివింగ్‌స్టోన్ మెరుపు ఇన్నింగ్స్.. గుజ‌రాత్ టార్గెట్ 190

-

ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు 16 వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ నెడ్డిన గుజ‌రాత్.. ముందుగా బౌలింగ్ చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ (5) విఫ‌లం అయినా.. మ‌రో ఓపెన‌ర్ ధావ‌న్ (35) రాణించాడు. అలాగే లివింగ్ స్టోన్ ( 27 బంతుల్లోనే 64) మెరుపు ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 237 స్ట్రైక్ రేట్ తో గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు చ‌మ‌ట‌లు ప‌ట్టించాడు.

7 ఫోర్లు, 4 సిక్స్ ల‌తో ప‌రుగుల వ‌ర‌దా పారించాడు. జితేశ్ శ‌ర్మ ( 11 బంతుల్లో 22), రాహుల్ చాహ‌ర్ ( 14 బంతుల్లోనే 22 ) కూడా రాణించారు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణ‌త 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి.. 189 ప‌రుగులు చేసింది. దీంతో గుజ‌రాత్ ముందు 190 టార్గెట్ ఉంది. గుజ‌రాత్ బౌల‌ర్లు.. రషీద్ ఖాన్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే ద‌ర్శ‌న్ న‌ల్కండే 2, ఫెర్గుస‌న్, హ‌ర్ధిక్ పాండ్యా, షమీ త‌లో ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news