బెంగుళూరు మరియు కోల్కతాల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదటి అర్ధభాగంగా ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత ఓవర్ లలో వికెట్ల 7 నష్టానికి 206 పరుగులు చేసింది. కోల్కతా బ్యాటింగ్ లో గుర్బాజ్ 57, శార్ధూల్ ఠాకూర్ 68, రింకు సింగ్ 36 లు రాణించడంతో భారీ స్కోర్ చేయగలిగింది. కానీ ఒక దశలో కోల్కతా ఈ మాత్రం స్కోర్ చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ శార్దూల్ మరియు రింకు సింగ్ లు ఆరవ వికెట్ కు 103 అత్యధిక పరుగులు జోడించడంతో ఇది సాధ్యమయింది.
శార్దూల ఠాకూర్ కు రింక్ నుండి చక్కని సహకారం లభించడంతో రెచ్చిపోయి ఆడి కోల్కతాకు మంచి టోటల్ ను ఇచ్చాడు. బెంగుళూరు బౌలర్లలో విల్లీ 2 వికెట్లు మినహా ఎవ్వరూ రాణించలేదు. ఈ స్కోర్ బెంగుళూరు సాధించడం అంత సులభం కాదు, ఒకవేళ ఈ మ్యాచ్ లో బెంగుళూరు గెలవాలంటే మరోసారి కోహ్లీ మరియు డుప్లెసిస్ లు తమ బ్యాట్ లకు పని చెప్పాల్సిందే.