ఐపీఎల్ 2023 : చావో రేవో మ్యాచ్ లో కేకేఆర్ ఛేజింగ్…!

-

నేటి మ్యాచ్ లో పంజాబ్ మరియు కేకేఆర్ జట్ల మధ్యన ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కొంచెం కూడా ఆలోచించకుండా బ్యాటింగ్ తీసుకుంది. ఈడెన్ గార్డెన్స్ ఎప్పుడూ బ్యాటింగ్ కు బాగా అనుకూలిస్తుంది. ఇక్కడ ఎన్ని పరుగులు చేసినా కాపాడుకోవడమే కష్టం .. కాగా ప్రస్తుతం పంజాబ్ ఆడిన 10 మ్యాచ్ లలో అయిదు గెలిచి అయిదు మ్యాచ్ లలో ఓడిపోయింది. అదే సమయంలో కోల్కతా ఆడిన 10 మ్యాచ్ లలో నాలుగు మాత్రమే గెలిచి పంజాబ్ కన్నా దిగువన ఉంది. దీనితో కోల్కతా ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆప్స్ కు వెళ్ళడానికి ఆశలు ఉంటాయి.

మరి ఛేజింగ్ చేయనున్న కోల్కతా పంజాబ్ ను తక్కువ స్కోర్ కు కట్టడి చేస్తుందా చూడాలి . కోల్కతాకు రస్సెల్ , నితీష్ రానా , రింకు సింగ్ మరియు జాసన్ రాయ్ లు అంచనాలకు తగినట్లు ఆడితే విజయం తథ్యం. మరి చూద్దాం చావో రేవో మ్యాచ్ లో ఛేజింగ్ చేయనున్న కోల్కతా గెలుస్తుందా ?

 

Read more RELATED
Recommended to you

Latest news