ఈ సీజన్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ దారుణంగా విఫలం అయింది. తెలుగు వారి గుండెల్లో నిలిచిన టీమ్ గా వారి అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. గత సీజన్ లో SRH కెప్టెన్ గా మధ్యలోనే వార్నర్ ను తొలగించి న్యూజీలాండ్ ప్లేయర్ విలియంసన్ కు కెప్టెన్సీ కట్టబెట్టారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ప్లే ఆఫ్ కు చేరకుండానే లీగ్ స్టేజ్ నుండి నిష్క్రమించింది. అయితే ఆ తర్వాత జరిగిన వేలంలో వార్నర్ ను తప్పించింది , అలాగే కెన్ విలియం సన్ ను సైతం వేలానికి వదిలేసింది. అక్కడే సన్ రైజర్స్ తప్పు చేసింది, విలియంసన్ ఆట పరంగా ఫెయిల్ అయినా, కెప్టెన్ గా మ్యాచ్ ను తనదైన అద్భుతమైన నిర్ణయాలతో మలుపు తిప్పగలడు. కానీ మార్ క్రామ్ ను జట్టులోకి తీసుకుని కెప్టెన్ గా చేసింది. ఇప్పుడు జరుగుతున్న సీజన్ లో ఈ రోజుతో SRH ప్రయాణం ముగిసింది. మరో సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరకుండానే వెళ్ళిపోతోంది.
ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ లలో 4 మాత్రమే గెలిచింది. ఇక మార్ క్రామ్ అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యి జట్టు యాజమాన్యం అతనిపై పెట్టుకున్న అంచనాలను తలకిందులు చేశాడు. అలా SRH సహా యజమాని కావ్య మారన్ పప్పులో కాలేసి… మార్ క్రామ్ ను కెప్టెన్ చేసింది. ఇది పూర్తిగా ఫెయిల్ అయింది. ఒకవేళ కేన్ విలియంసన్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో ???