ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ మరియు ముంబై జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో గుజరాత్ గెలుస్తోగెలుపు … ఓటమి ఇలా సాగుతోంది తమ ప్రదర్శన, నిలకడగా విజయాలను సాధించడంలో విఫలం అవుతోంది. ఉదాహరణకు గత మ్యాచ్ లో అదృష్టం కలిసొచ్చి గుజరాత్ లక్నౌ పై గెలిచింది, కానీ ఓడిపోయే మ్యాచ్ అని చెప్పాలి. దానితో ఆడిన 6 మ్యాచ్ లలో 4 గెలిచి పాయింట్ల పట్టికలోనూ నాలుగవ స్థానంలో ఉంది. ఇక ముంబై మొదట్లో వరుసగా ఓడినా ఆఖరి మ్యాచ్ లలో గెలిచి… ఆడిన 6 మ్యాచ్ లలో 3 గెలిచి ఏడవ స్థానంతో సరిపెట్టుకుంది. కాగా గత సీజన్ లో ముంబై మరియు గుజరాత్ లు ఒకసారి తలపడగా అయిదు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం అందుకుంది.
ఐపీఎల్ 2023 : రోహిత్ VS పాండ్య… గెలుపు అవకాశాలు ఆ జట్టుకే !
-