క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఇండియన్ ప్రిమియర్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరుగనుంది. అయితే ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే చెప్పింది. అయితే దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు బీసీసీఐ ఛీప్ సౌరవ్ గంగూలీ. ఐపీఎల్ -2022 ఇండియాలోన జరుగుతుందని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితి చేయి దాటితే తప్పా… ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహిస్తామన్నారు. ముంబై, పుణేలో లీగ్ లోని మ్యాచులను జరుపుతామన్నారు. ఏప్రిల్ మేలలో పరిస్థితులను బట్టి నిర్ణయంలో మార్పు ఉండవచ్చని గంగూలీ తెలిపారు.
కాగా గత రెండు ఐపీఎల్ సీజన్లపై కరోనా ప్రభావం పడింది. ఇండియాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించారు. దుబాయ్, అబుదాబిల్లో మ్యాచులను నిర్వహించారు. ఆటగాళ్లు, సిబ్బంది బయోబబుల్ ఉంటూ ఐపీఎల్ లో ఆడారు. అయితే గత రెండు సీజన్లలో ఇండియన్స్ ఐపీఎల్ మజాను మిస్ అయ్యారు. దీంతో ఈ ఏడాది ఎలాగైనా.. ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించాలనే లక్ష్యంతో బీసీసీఐ ఉంది.