RR VS DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్… జట్ల వివరాలు ఇవే..

-

ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ పోరు జరగబోతోంది. ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ 5లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ బట్లర్ వీర ఫామ్ లో ఉన్నాడు. సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్ వంటి పవర్ హిట్లర్లు రాజస్థాన్ లో ఉన్నారు. మరోవైపు ఢిల్లీ టీం కూడా ఆర్ఆర్ టీంకు తక్కవగా ఏం లేదు. స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తో పాటు రిషబ్ పంత్ లతో ఢిల్లీ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాజస్థాన్ 11 మ్యాచులు ఆడితే 7 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ 11 మ్యాచుల్లో 5 మ్యాచులు గెలిచి 5వస్థానంలో ఉంది. 

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్

డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(w/c), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే

Read more RELATED
Recommended to you

Latest news