నారాయణ అరెస్ట్‌ వ్యవహారం.. మరోసారి టీడీపీపై సజ్జల ఫైర్‌..

-

టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో మాజీమంత్రి, టీడీపీ నేత నారాయణను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే.. నారాయణ అరెస్ట్‌పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు మరోసారి ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నారాయ‌ణ ఏదో విప్ల‌వ‌కారుడైన‌ట్లు ఆయ‌న అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా ఆ పార్టీ నేత‌లు అంత గ‌గ్గోలు చేయ‌డం ఏమిటంటూ మండిప‌డ్డారు స‌జ్జ‌ల.

Sajjala Ramakrishna Reddy - A Mistake Jagan May Repent Later

ప్ర‌శ్నా ప‌త్రాల లీకేజీని టీడీపీ నేత‌లు ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగా అభివ‌ర్ణించిన విష‌యాన్ని సజ్జల గుర్తు చేశారు. అలాంట‌ప్పుడు త‌మ ప్ర‌భుత్వం ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దా? అంటూ సజ్జల ప్ర‌శ్నించారు. 100 శాతం ఉత్తీర్ణ‌త కోస‌మే కొన్ని విద్యా సంస్థ‌లు పేప‌ర్ లీక్‌, మాల్ ప్రాక్టీస్ వంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నాయని స‌జ్జ‌ల ఆరోపించారు. ఇందులో భాగంగానే నారాయ‌ణ అరెస్ట్ అయ్యార‌న్న సజ్జల.. విచారణ ఎవరెవరో బయటకు వస్తారో చూడాలన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news