IPL 2022 : పాపం కోహ్లీ.. మళ్లీ గోల్డెన్ డక్.. గత 14 ఏళ్లలో ఇదే తొలి సారి!

-

హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో మరోసారి గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు విరాట్ కోహ్లీ. మార్కో జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ 2 ఓవర్ రెండో బంతికి కెప్టెన్ డుప్లెసిస్ క్లీన్ బోల్డ్ కాగా… ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తొలి బంతికే అవుటయ్యాడు. స్లిప్ లో క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు.

అయితే ఈ వికెట్ క్రెడిట్ మాత్రం హైదరాబాద్ కెప్టెన్ కెన్ విలియమ్స్ దేనని చెప్పాలి. కోహ్లీ బలహీనతలపై మంచి హోం వర్క్ చేసి వచ్చిన కేన్ మామ… అతను క్రీజులోకి రాగానే సెకండ్ స్లిప్ ఫీల్డర్ తీసుకువచ్చాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ అందరినీ నిరాశపరిచే పెవిలియన్ కు చేరుకున్నాడు.

అయితే ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ రికార్డు నమోదు చేసుకున్నాడు మైదానంలో పరుగుల వరద పారించాడు కోహ్లీ ఇలా వరుసగా గోల్డెన్ డక్ కావడం అతని 14 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news