మద్యం తాగేందుకు నిరాకరించాడని ఓ దళిత యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.అనంతరం మూత్రం కలిపిన మద్యం తాగించారు.ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని రేవారీ లో బైరంపూర్ బడాగ్ని గ్రామంలో జరిగింది.ఆధునిక సమాజం ఎటు అడుగు వేస్తుందో తెలియడం లేదు.రాతి యుగం నుంచి రాకెట్ యుగం దాకా తన విజ్ఞానాన్ని పెంచుకున్నా దళితుల బతుకులు మారడం లేదు.నిత్యం ఏదో ఒక చోట..ఏదో ఒక మూలన దళితులు అవమానాలు..చీత్కరింపులకు గురవుతూనే ఉన్నారు.ఎంతో మంది నాయకులు ఎన్నో ప్రసంగాలు ఇచ్చిన దళితులపై దారుణాలు ఆగడం లేదు.తాజాగా హర్యానాలో ఇలాంటి దారుణమే జరిగింది.దళిత యువకుడిపై కొంతమంది అగ్రకులాల యువకులు అమానవీయంగా ప్రవర్తించారు.
యువకుడు మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి పట్టణానికి వెళుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తుషార్, రోహిత్ లు కలిసి ఏవో మాయమాటలు చెప్పి ఆ దళిత యువకుడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.తమతో కలిసి మద్యం సేవించాలని యువకుడి పై ఒత్తిడి చేశారు.అందుకు అతడు నిరాకరించడంతో అతడి చేతులు కట్టేసి..మూత్రం కలిపిన బీరును తగ్గించేందుకు ప్రయత్నించారు.అనంతరం ఆ యువకున్ని తీవ్రంగా కొట్టి..అతడి వద్ద ఉన్న డబ్బులు లాక్కుని పారిపోయారు.అపస్మారక స్థితిలోపడివున్న ఆ యువకున్ని అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.