కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్.. లక్నో టార్గెట్ ఎంతంటే..?

-

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఎక్కడ తడబడకుండా అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ పరుగులు చేశాడు. ఓపెనర్లు బట్లర్, యశస్వి జైశ్వాల్ కాస్త పర్వాలేదనిపించినప్పటికీ తక్కువ స్కోరే వెనుదిరిగారు. పరాగ్, సంజు శాంసన్ చెలరేగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు సంజు శాంసన్. సెంచరీకి చేస్తాడని అందరూ భావించారు. కానీ అనుకోకుండా సెంచరీ చేయలేకపోయాడు శాంసన్. 52 బంతుల్లో 82 పరుగులు చేశాడు. 

 ఆ తరువాత వచ్చిన హిట్మేయర్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తరువాత జురెల్ వచ్చి రావడంతోనే సిక్స్ బాదాడు. ఫాస్ట్ నవీన్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించినప్పటికీ చేతి వేల్లకు తాకి బౌండరీ బయట పడింది. దీంతో సిక్స్ గా మారింది. చివరికి 20 ఓవర్లలో స్కోర్ సాధించాడు. జురెల్ రెండు సార్లు క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. 19 ఓవర్లకు 179 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లకు 193 పరుగులు సాధించింది. లక్నో టార్గెట్ 194 పరుగులు. ఛేదిస్తుందో లేదో వేచి చూడాలి మరీ. 

Read more RELATED
Recommended to you

Latest news