తెలంగాణలో కాంగ్రెస్ 17 ఎంపీ సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.. కానీ తెలంగాణలో కాంగ్రెస్ 17 ఎంపీ సీట్లు గెలవదు.. రాహుల్ గాంధీ జన్మలో ప్రధాని కాలేరని కేంద్రమంత్రి, టీ-బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలు, బూత్ కమిటీల బలోపేతంపై చర్చించారు. ఏప్రిల్ 6న ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీ టిఫిన్ బైటక్ నిర్వహించాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేతలు, కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లాలని.. తెలంగాణలో కచ్చితంగా బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తోందని అన్నారు.
12 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ జన్మలో ప్రధాని కాలేరు.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని సెటైర్ వేశారు. తెలంగాణలో రాజకీయ వాతావరణం బీజేపీకే అనుకూలంగా ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టిన డబుల్ డిజిట్ సీట్లు బీజేపీకే వస్తాయని జోస్యం చెప్పారు. బీజేపీ బూత్ ఏజెంట్లు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ను ఓటర్ను కలవాలి.. ఏ పోలింగ్ బూత్కు ఆ పోలింగ్ బూత్ వారీగా కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు.